ఆందోల్ మండలం, ఫిబ్రవరి 09, తెలంగాణ అనుక్షణం :సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట బస్టాండ్ లో బస్సులు కనపడకుండా ప్రైవేట్ వాహనాలు నిలపడం జరుగుతుందని దీనికి కారణం డిపో మేనేజర్ గారేనని జోగిపేట 17వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్ ముందు గల దుకాణదారులు మరింత లోపలికి రావడం చేత బస్టాండ్ యొక్క జాడ తెలియకుండా పోయిందని రవాణా సిబ్బంది మరియు మేనేజర్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ వాహనాలను లోపలికి రానివ్వద్దని ఆయన కోరారు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికిని ఎలాంటి మార్పు రాలేదని ఈ విషయాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ దగ్గరికి తీసుకెళ్తానని దీనికి తగిన పరిష్కారం త్వరలోనే చూపిస్తానని ఒక ప్రకటనలో అతను తెలియజేశాడు.
ప్రైవేట్ వాహనాలకు అడ్డగా మారిన జోగిపేట బస్టాండ్