తెలంగాణ అనుక్షణం :పారిశుద్ధ్య మహిళా కార్మికులను సన్మానించిన సాగంటి మంజుల అ oతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గోపాలపురం 56 డివిజన్ లో పని చేస్తున్న నగరపాలక సంస్థ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ మరియు హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు సగంటి మంజుల ఆత్మీయ సన్మానం చేశారు... ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టెల్లారక ముందే వీధుల్లో ఉన్న చెత్త మురికిని శుభ్రం చేస్తూ అందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్న సిపాయిలు, మురికి లో ఉంటూ మురికి లో బతుకుతూ మనకి సేవ చేస్తున్న వారిని సన్మానించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని... పని మాత్రమే కాదు వారి ఆరోగ్యాన్ని కపాడుకోమని.. మీరు బాగుంటేనే సమాజం బాగుంటుందని,, త్వరలోనే వారికి వారి సమస్త తరపున ఉచిత హెల్త్ క్యాంప్ పెట్టిస్తానని అన్నారు.. అనంతరం వారికి శాలువాలతో కాకుండా వారికి ఉపయోగపడేలా 56 డివిజన్ లో పనిచేస్తున్న 36 మంది మహిళలకు పెద్ద టవల్స్ తో సన్మానించి టిఫిన్ బాక్స్ లు, పండ్లు అందించారు.. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్ తో పాటు ఉపాధ్యాయురాళ్లు సుమలత, గీత తదితరులు పాల్గొన్నారు.. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మంజులకు కార్పొరేటర్ సన్మానిస్తూ మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేయాలని కొనియాడారు... కార్మిక మహిళలు మంజులకు దీవెనలు అందించారు...
పారిశుద్ధ్య మహిళా కార్మికులను సన్మానించిన సాగంటి మంజుల