ఉత్తర ప్రదేశ్ లో జరిగే భారతీయ కాళాకార్ సంఘ్ మూడు రోజులపాటు జరిగే కళా మహోత్సవానికి హనుమకొండ ఆర్టిస్ట్ సాగంటి మంజులకు ఆహ్వానం ..   భారతీయ కళాకార్ సంఘ్ (జాతీయ ఆర్టిస్టు సంక్షేమ సంఘం) ఆధ్వర్యంలో ఓర్చ టౌన్ లో ఈ నెల 10,11,12 తేదీలలో మూడు రోజుల పాటు జరిగే కళా మహోత్సవానికి సంఘ్ యొక్క తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి గా నియమితులైన హన్మకొండ వాసి ప్రముఖ ఆర్టీస్ట్, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల కి ఆహ్వానం అందింది... ఈ మేరకు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశం లోని అన్ని రాష్ట్రాల ఆర్టిస్టులు పాల్గొననున్నారు. ఆర్టిస్టుల సమస్యల మీద సమీక్ష, ఆర్ట్ ఎగ్జిబిషన్, పలు ప్రాంతాల సందర్శన లతో పాటు పలు కార్యక్రమాలు ఉంటాయని ఈ అవకాశం రావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని మంజుల తెలిపారు..


Comments