- నియామక పత్రం అందించిన టిపిసిసి రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతo
- తన నియమకానికి సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన గొర్రె మహేందర్
ఎల్కతుర్తి, ఫిబ్రవరి16( తెలంగాణ అనుక్షణం):కాంగ్రెస్ పార్టీ హన్మకొండ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన గొర్రె మహేందర్ ను టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ నాగరిగారి ప్రీతం ప్రకటించారు. ఈ సందర్భంగా గొర్రె మహేందర్ కు నియామక పత్రం ఆయన అందించారు. అనంతరం గొర్రె మహేందర్ మాట్లాడుతూ తన తాత, తండ్రి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన విధంగానే తను కూడా కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సైతం జెండా వదలకుండా గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకుల బెదిరింపులను సైతం తట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి హుస్నాబాద్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ గెలుపుకు కృషి చేశానని తన సేవలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా నియమించారని తన నియమకానికి సహకరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.