ఆరె‌లకు ఓబీసీ సాధనకు కృషి చేయండి

 
- ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగుర్ల వెంకన్న

ఎల్కతుర్తి,ఫిబ్రవరి16(తెలంగాణఅనుక్షణం):ఆరె కులస్తులకు ఓబీసీ సర్టిఫికెట్ సాధనకు ఆరె సంక్షేమ సంఘ నేతలు కృషి చేయాలని, ఢిల్లీలోని మకాం వేసి సర్టిఫికెట్ సాధించిన తర్వాతే తెలంగాణకు రావాలని ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న అన్నారు. ఆదివారం ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానంతరం శివాజీ విగ్రహ ఆవిష్కరణ కమిటీ అధ్యక్షడు మోరే బాపూరావు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ విగ్రహావిష్కరణకు శ్రమించిన దామెర గ్రామ విగ్రహ కమిటీ, ఆరె సంక్షేమ సంఘ కమిటీని ప్రత్యేకంగా అభినందించారు. ఆరె కులస్తులతో పాటు అందరికీ ఆరాధ్యుడైన శివాజీ మహరాజ్ స్ఫూర్తిని అందరూ తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఆరె కులస్తులకు సూచించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అద్భుతమైన శివాజీ విగ్రహాన్ని దామెరలో ఆవిష్కరించిన ఆరె సంఘం కమిటీ వారిని అభినందించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ హీరోగా ఛత్రపతి శివాజీని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. సినీ హీరోల కంటే కూడా శివాజీ మహరాజ్ నే తమ నాయకుడిగా పిల్లలు భావిస్తున్నారని చెప్పారు. శివాజీ పుట్టిన కులంలో జన్మించిన ఆరె కులస్తులు అదృష్టవంతులని వెల్లడించారు. అయితే, ఛత్రపతి శివాజీ మహరాజ్ ఒక్క ఆరె కులానికి చెందిన నాయకుడు మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపెల్లి శివాజీ, ఆరె సంక్షేమ సంఘం ఉద్యమ కమిటీ చైర్మన్ సోమిడి అంజన్‌రావు, సంఘ ఉపాధ్యక్షుడు జెండా రాజేశ్, మండల గౌరవ అధ్యక్షులు సుఖినే సంతాజి, సుక్కిన సుధాకర్ రావు, హింగే ,భాస్కర్, సాంబరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు కదమ్ రాజు, కోశాధికారి వరికల కృష్ణ, వరికెల దామోదర్, ఇరువాల మల్లయ్య, మోరే రవీందర్, మురాళ్ళ శ్రీనివాస్, మోరే బాబురావు, సోలంకి శ్రవణ్ కుమార్, కరట్లపల్లి రమేష్, నగేష్, శ్రీనివాస్, కిషన్ రావు, రాజు, రవీందర్, అశోక్, నరసింగం తదితరులు పాల్గొన్నారు.

Comments