ఆరే కుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సంతాజి - ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు శెట్టిపల్లి శివాజీ

ఎల్కతుర్తి, ఫిబ్రవరి16( తెలంగాణ అనుక్షణం):ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సుక్కిన సంతాజిని ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు శెట్టిపల్లి శివాజీ తెలిపారు. ఆదివారం మండలంలోని దామేర గ్రామంలో శివాజీ విగ్రహావిష్కరణలో శెట్టిపల్లి శివాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరె కులానికి చింతలపల్లి గ్రామానికి చెందిన సుఖిన సంతాజి చేసిన సేవలు ఎనలేనిమని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలు గుర్తించి ఆయన సేవలు రాష్ట్రానికి అవసరమని తెలిపారు. అందుకే రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటిస్తున్నామని అన్నారు. సంతాజి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేసినందుకు అధ్యక్షులు శివాజీకి, గౌరవ అధ్యక్షులు నాగూర్ల వెంకన్న, ఉపాధ్యక్షులు జెండా రాజేష్, సోమిడీ అంజన్ రావులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఆరెకుల సంక్షేమానికి కృషి చేస్తానని, ఓబిసి తెచ్చేందు గాను తన వంతు ప్రయత్నం ఉంటుందన్నారు. సంతాజీ ఎంపిక పట్ల మండల ఆరెకుల సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Comments